Asianet News TeluguAsianet News Telugu

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

బిగ్ బాస్ టైటిల్ విజేత కౌశల్ తనకి డాక్టరేట్ రాబోతుందని చెప్పి అభిమానులను ఖుషీ చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో బైట్ విడుదల చేశాడు కౌశల్. 

Does Kaushal deserve a doctorate?
Author
Hyderabad, First Published Oct 8, 2018, 3:17 PM IST

బిగ్ బాస్ టైటిల్ విజేత కౌశల్ తనకి డాక్టరేట్ రాబోతుందని చెప్పి అభిమానులను ఖుషీ చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో బైట్ విడుదల చేశాడు కౌశల్. అందులో ''మీరు అభిమానించే కౌశల్ త్వరలోనే డాక్టరేట్ అవార్డు అందుకోబోతున్నాడు.

హార్వెస్ట్ బైబుల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వబోతున్నారు. దానికి గల కారణాలను కూడా మీకు చెబుతాను'' అంటూ వెల్లడించాడు. కౌశల్ నుండి ఈ అనౌన్స్మెంట్ రాగానే కొందరు పాజిటివ్ గా స్పందించగా.. మరికొందరు మాత్రం అతడిని వేలెత్తి చూపుతున్నారు.

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏదోక ఫీల్డ్ లో తమ సేవలు అందించిన వారికి, సమాజానికి మేలు చేసే వారికి డాక్టరేట్ ఇస్తుంటారు. అలాంటిది కౌశల్ కి ఎలా ఇస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. అతడు డాక్టరేట్ కి అర్హుడు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

అతడి కారణంగా సొసైటీకి ఎలాంటి మంచి జరగలేదని, అతడి కోసం పుట్టుకొచ్చిన ఆర్మీ కారణంగా చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇదే యూనివర్సిటీ 2016 లో రాజకీయనాయకుడు బాబు మోహన్ కి కి డాక్టరేట్ ఇచ్చింది. రీసెంట్ గానే అయన టీఆర్ఎస్ పార్టీ నుండి బిజెపీలోకి చేరారు.

ఇవి కూడా చదవండి.. 

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

Follow Us:
Download App:
  • android
  • ios