Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల మధ్య నడిచింది. కౌశల్ ని విజేతగా ప్రకటించి ఈ షోని పూర్తి చేశారు. కౌశల్ గెలిచినందుకు ఎంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారో.. అలానే ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని వారు కూడా ఉన్నారు. 

deepthi nallamothu comments on kaushal
Author
Hyderabad, First Published Oct 3, 2018, 12:38 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల మధ్య నడిచింది. కౌశల్ ని విజేతగా ప్రకటించి ఈ షోని పూర్తి చేశారు. కౌశల్ గెలిచినందుకు ఎంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారో.. అలానే ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని వారు కూడా ఉన్నారు. 

బిగ్ బాస్ ఫైనల్స్ కి చేరుకున్న దీప్తి నల్లమోతు.. కౌశల్ విజయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''గేమ్ పరంగా కౌశల్ కి తన ఫోకస్ ప్లస్ అయింది. ఆయన విన్నర్ కావడానికి అన్ని కారణాలు కలిసొచ్చాయి. షోలో పాల్గొన్న 17 మందికి గెలిచే అర్హత ఉంది కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించవు.. మరికొన్ని సార్లు అనుకూలిస్తాయని'' వెల్లడించింది. 

ఇక తను షో నుండి బయటికొచ్చిన తరువాత చాలా మంది తనను కలిసి విజేతగా మీరు నిలుస్తున్నారని అనుకున్నట్లు చెప్పారట. కనీసం రన్నరప్ లో అయినా ఉంటారనుకున్నామని వారు చెబుతుంటే వారి మనసులను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. 
 

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!

 

Follow Us:
Download App:
  • android
  • ios