MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?

Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?

Ram Charan: మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగా వారసుడైనా.. ఏమాత్రం గర్వం లేకుండా చాలా వినయంగా ఉంటాడు. ఆయన సినిమాలు, రెమ్యునరేషన్,డేట్స్ విషయంలో నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం వైరల్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 03 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెగా వారసుడి గొప్పతనం..
Image Credit : IMDB

మెగా వారసుడి గొప్పతనం..

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవన్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన సొంత ట్యాలెంట్ మీద స్టార్ గా ఎదిగాడు చరణ్. పాన్ ఇండియా హీరోగా మాత్రమే కాదు, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు ఎదిగాడు చరణ్. సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైన వెనకాడని మెగా హీరో.. నిర్మాతల పాలిట దేవుడిలా మారాడు. తన సినిమాలకు సబంధించిన రెమ్యునరేషన్ కానీ, ఇతర ఖర్చుల విషయంలో చరణ్ తీరు కంటతడి పెట్టిస్తుంటుంది. ఈ విషయంపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏమన్నాడంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నటుడిగా నిర్మాతగా రాణించిన బండ్ల..
Image Credit : Bandla Ganesh

నటుడిగా నిర్మాతగా రాణించిన బండ్ల..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అంటే ఓ స్పెషల్ మార్క్ ఉంటుంది. తనదైన శైలిలో కామెంట్స్, కాంట్రవర్సీలతో.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. కామెడీ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. నిర్మాతగా మారిన బండ్లగణేష్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి, కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. ఆయన నిర్మించిన చిత్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ఒకటి. ఈ సినిమా విడుదల సమయంలో రామ్ చరణ్ చూపించిన సంస్కారం, ఆయన ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకుంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

34
సినిమా విడుదల సమయం... ఫుల్ టెన్షన్!
Image Credit : Asianet News

సినిమా విడుదల సమయం... ఫుల్ టెన్షన్!

'గోవిందుడు అందరివాడేలే' సినిమా విడుదలయ్యే రోజు రాత్రి జరిగిన ఒక ఎమోషనల్ సంఘటన గురించి బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు. "సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో రామ్ చరణ్ నాకు ఫోన్ చేశాడు. "గణేష్ ఎక్కడున్నావ్?" అని చరణ్ అడగ్గా, నేను ల్యాబ్‌లో ఉన్నానని చెప్పాను. వెంటనే ఇంటికి రమ్మని చరణ్ పిలిచాడు. అయితే, ఆ సమయంలో నాకు చాలా భయం, వేసింది. ఎందుకంటే రామ్ చరణ్‌కు నేను ఈ సినిమాకు సబంధించి ఇంకా రెండు నుంచి మూడు కోట్ల వరకు బాకీ ఉంది. సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. చేతిలో డబ్బులు లేవు... ఈ టైమ్ లో ఆ డబ్బుల గురించి ఎక్కడ అడుగుతారోనని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. "ఒకవైపు సినిమా విడుదల టెన్షన్, మరోవైపు ఈ డబ్బుల గొడవ... ఈ రెండు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి రా బాబూ!" అని ఫుల్ టెన్షన్‌లో చరణ్ ఇంటికి వెళ్లినట్లు'' బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు.

44
రామ్ చరణ్ గొప్ప మనసు – 30 ఏళ్ల కుర్రాడి క్యారెక్టర్!
Image Credit : Asianet News

రామ్ చరణ్ గొప్ప మనసు – 30 ఏళ్ల కుర్రాడి క్యారెక్టర్!

ఇంటికి వెళ్లిన తర్వాత బండ్ల గణేష్‌ను చూసి చరణ్ "ఏంటి పరిస్థితి?" అని ఆరా తీశారు. దానికి బండ్ల గణేష్ భయపడుతూనే, "అన్నీ దగ్గరకు వచ్చాయి బాబు, కొన్ని క్లియర్ చేయాల్సి ఉంది, సినిమా అవ్వగానే మీ డబ్బులు క్లియర్ చేస్తాను" అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, రామ్ చరణ్ ఆ సమయంలో ప్రవర్తించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని బండ్ల గణేష్ అన్నారు. చరణ్ వెంటనే ఆయనకు టీ, బిస్కెట్లు ఇచ్చి ఆప్యాయంగా సత్కరించి, "ముందు హ్యాపీగా సినిమా రిలీజ్ చేయి గణేష్, మన డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం. ముందు సినిమా థియేటర్లలోకి రావడం ముఖ్యం" అని భరోసా ఇచ్చారు.

కేవలం 30 ఏళ్ల వయసున్న ఒక యంగ్ హీరో, ఆ సమయంలో అంత పెద్ద మొత్తంలో డబ్బు బకాయి ఉన్నప్పటికీ, నిర్మాత పడుతున్న టెన్షన్‌ను అర్థం చేసుకుని సపోర్ట్‌గా నిలవడం మామూలు విషయం కాదని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు, ఆయనకు కళ్లలో నీళ్లు తిరిగాయి. రామ్ చరణ్ వ్యక్తిత్వం, ఆయనకున్న సంస్కారం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన ఉదాహరణ అని బండ్ల అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Recommended image2
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image3
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Related Stories
Recommended image1
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved