Asianet News TeluguAsianet News Telugu

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల నడుమ పూర్తయింది. కౌశల్ ని విజేతగా ప్రకటించారు. దానికి కారణం అతడికి పెద్ద ఎత్తున ఓట్లు పడడమే.. కౌశల్ కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ అతడిని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చింది. కౌశల్ ని విజేతగా ప్రకటించేవరకు కౌశల్ ఆర్మీ తన పని చేస్తూనే ఉంది. 

samrat, deepthi nallamothu fires on kaushal army
Author
Hyderabad, First Published Oct 4, 2018, 3:01 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల నడుమ పూర్తయింది. కౌశల్ ని విజేతగా ప్రకటించారు. దానికి కారణం అతడికి పెద్ద ఎత్తున ఓట్లు పడడమే.. కౌశల్ కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ అతడిని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చింది. 

కౌశల్ ని విజేతగా ప్రకటించేవరకు కౌశల్ ఆర్మీ తన పని చేస్తూనే ఉంది. అయితే వారు కౌశల్ ని అభిమానించడంతో పాటు హౌస్ లో కౌశల్ ని ఇబ్బంది పెట్టిన వారిని గేమ్ వరకు మాత్రమే కాకుండా.. వ్యక్తిగత విషయాలకు వెళ్లి మరీ ట్రోల్ చేశారు. హౌస్ నుండి బయటకి వచ్చిన సభ్యులు ఈ ట్రోలింగ్ పై మండిపడుతున్నారు.

ముఖ్యంగా దీప్తి, సామ్రాట్ లు ఈ ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే అంటూ ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు. ముందుగా సామ్రాట్ మాట్లాడుతూ.. ''ట్రోలింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. పర్సనల్ లెవెల్ కి వెళ్లి మరీ ట్రోల్ చేస్తున్నారు. పోని మగాళ్లంటే లైట్ తీసుకుంటారు.. ఆడవారి విషయంలో కూడా అలానే ప్రవర్తించారు. దీనిపైచాలా అసంతృప్తిగా ఉన్నాను.

నాపై కూడా ట్రోల్స్ వచ్చాయని విన్నాను. కానీ పూర్తిగా చూడలేదు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అభిమానం అనేది అందరికీ ముఖ్యమే.. కౌశల్ కి టైటిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది.. అయితే ఈ ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో దాన్ని ఆపించాల్సిన బాధ్యత అతడితే'' అంటూ సామ్రాట్ వెల్లడించాడు. దీప్తి సైతం కౌశల్ బాధ్యత తీసుకొని ఈ ట్రోల్స్ ని ఆపించాలని కోరింది!

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!

Follow Us:
Download App:
  • android
  • ios