బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది కౌశల్ ఆర్మీ. అతడి విజయం కోసం కౌశల్ ఆర్మీ ఎంతగా ఎదురుచూసిందో, అలానే అతడు విజేత కాకూడదని కోరుకునే వారి సంఖ్య కూడా బాగానే ఉంది. 

షోలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు కౌశల్ గెలుపుని తట్టుకోలేకపోయారు. వారిలో బాబు గోగినేని ముందుంటారు. కౌశల్ ఆర్మీ అనేది ఫేక్ అని.. అసలు సోషల్ మీడియా తప్ప బయట ఎక్కడా వారు కనిపించరని కామెంట్స్ చేశాడు. తాజాగా బాబుగోగినేని మరో పాయింట్ లేవనెత్తారు.

3500 డాలర్లకు లక్ష ఈమెయిల్ అడ్రెస్ లు అమ్ముతున్నారని వాటి ద్వారా కౌశల్ ఓట్లు వేయించుకున్నాడని గోగినేని అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై స్పందించిన కౌశల్.. గోగినేనికి ఛాలెంజ్ విసిరాడు.

''3500 డాలర్లకు లక్ష ఈమెయిల్ అడ్రెస్ లు ఇస్తారనే విషయం గోగినేని గారికి ఎలా తెలిసింది. ఆయన ఆ డాలర్లను వాడుకొనే బిగ్ బాస్ హౌస్ లో ఏడెనిమిది వారాలు ఉన్నారేమో..?'' అంటూ విమర్శలు చేశారు. నేను డబ్బిలిచ్చి గెలిచానని గోగినేని గారు నిరూపిస్తే.. టైటిల్ అతడి చేతిలో పెట్టి వెళ్లిపోతానని ఛాలెంజ్ విసిరాడు. 

ఇవి కూడా చదవండి.. 

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!