బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడు బిగ్ బాస్ ట్రోఫీ గెలిచాడని అనౌన్స్ చేసినప్పుడు హౌస్ మేట్స్ చాలా మంది తెల్లముఖం పెట్టారు. చాలా మందికి కౌశల్ గెలవడం ఇష్టం లేదు.. దాన్ని తమ చేతలతో నిరూపించారు.

ఇదే విషయంపై మాట్లాడిన కౌశల్.. ''నేను గెలిచిన తరువాత ఒక్క కంటెస్టెంట్ కూడా ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెప్పలేదు. టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా కంటెస్టెంట్స్ లో చాలా మంది చప్పట్లు కొట్టలేదు. ఒక వ్యక్తి గెలుపుని ఎప్పుడైతే స్వీకరించలేదో.. నేను అప్పుడే వారిని వదిలేశాను. వాళ్లు గేమ్ ని గేమ్ లా చూడలేదు. తనీష్.. బయటకొచ్చాక నీ సంగతి చూస్తా అన్నారు. ఇంకొకరు చీప్ ఫెలో అన్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

అలానే హౌస్ లో ఎవరి మీద చాలా కోపముందని అడగగా.. టక్కున తేజస్వి, బాబు గోగినేనిల పేర్లు చెప్పాడు. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చాడు. ''తేజస్వి నేను భోజనం చేస్తుంటే.. సిగ్గు లేకుండా తింటున్నావని అంది. చాలా సార్లు నా మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది.

అవి టెలికాస్ట్ అయ్యాయో లేదో తెలియదు. ఇక బాబు గోగినేని చేసే ప్రతి టాస్క్ చీటింగే.. కౌశల్ లెవెల్ ఏంటని మాట్లాడారు. నేను ఆయనతో క్లోజ్ గా ఉన్న సమయంలో కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నాను. ఒక బ్రదర్ గా షేర్ చేసిన విషయాలను ఆయన బయటపెట్టడంతో నేను బాధ పడ్డాను'' అని తెలిపారు.

ఇవి కూడా చదవండి.. 

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!