పెద్ద సినిమాలు అనగానే ఓపినింగ్స్ బాగుంటాయి. హిట్ అయితే ధియోటర్స్ కళకళ్ళాడతాయి. సైకిల్ స్టాండ్ నుంచి లోపక క్యాంటిన్ వాడు దాకా అంతా హ్యాపీగా ఉంటారు. అయితే ఇది నాణానికి ఓ వైపు. పెద్ద సినిమాను ఎక్కువ రేటుకు పెట్టిన తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పరిస్దితి వేరే రకంగా ఉంటుంది. తాము పెట్టిన పెట్టుబడి ఎన్ని రోజుల్లో రికవరీ అవుతుంది. లాభాలు తెచ్చిపెడుతుందా..లాంగ్ రన్ ఉంటుందా..అసలు ఎంత రావాలి అనే లెక్కలు వాళ్లు వేసుకుంటూంటారు. ఇది ప్రతీ పెద్ద సినిమా రిలీజ్ సమయంలో జరగే వ్యవహారమే. 

ఇక ఈ సంక్రాంతికి  సినిమాల్లో ఒకటైన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' బిజినెస్ చాలా బాగా జరిగింది.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో అన్ని ఏరియాలు క్రేజీ ఆఫర్స్ తో లాక్ చేసారు.  దానికి తోడు రామ్  చరణ్ సూపర్ హిట్  'రంగస్థలం' తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం చిత్రంపై క్రేజ్  నెలకొంది. ఈ నేపధ్యంలో థియేట్రికల్ బిజినెస్ 90 కోట్ల పైగానే జరిగింది.  దాంతో  సినిమా కనీసం 100 కోట్ల షేర్ రాబడితేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు.  

ఈ 100 కోట్ల మార్కును అందుకోవాలంటే సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. సినిమా ప్రోమోలు , ట్రైలర్స్ చూస్తూంటే నో డౌట్ అనిపిస్తోంది.  అలాగే ఈ చిత్రం  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా, ఫ్యామిలీ సన్నివేశాలతో సాగిపోతుందని, సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ విశ్వరూపం చూపించాడని, యాక్షన్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని తెలుస్తోంది.

కానీ అదే సమయంలో పోటీ కూడా అలాగే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ పై అందరి దృష్టీ ఉంది. దాంతో  చెర్రీ బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలని డిస్ట్రిబ్యూటర్స్ లో ఎదురుచూపులు మొదలయ్యాయి. ఏదైనా  జనవరి 11 మార్నింగ్ షో  వరకు ఆగాల్సిందే.   

సంబంధిత వార్తలు..

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!