సినీ నటుడు వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ లోనే నిశ్చితార్ధం ఉంటుందని అలాగే డిసెంబర్ లో పెళ్లి ఫిక్స్ అయ్యిందని రూమర్స్ విబిపించాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు ఒక క్లారిటీ వాచ్చినట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే వెంకటేష్ డాటర్ మ్యారెజ్ వచ్చే ఏడాది జరగనున్నట్లు సమాచారం. అయితే నిశ్చితార్ధం మాత్రం వచ్చే నెలలోనే ఫినిష్ చేయనున్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు. డిసెంబర్ 24వ తేదీన ఎంగేజ్మెంట్ ను హైదరాబాద్ రామానాయుడు సినీ విలేజ్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను చాలా సింపుల్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎంగేజ్మెంట్ కు వధూవరుల దగ్గరి కుటుంబ సభ్యులు అలాగే అతి ముఖ్యమైన సెలబ్రెటీలు మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ కూడా ఎండింగ్ దశలో ఉంది. వీలైనంత వరకు అన్ని పనులను ఫినిష్ చేసుకొని కూతురి పెళ్లి హడావుడితో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు ఈ స్టార్ హీరో.