సారాంశం

పవన్ కల్యాణ్ గురించి ప్రేక్షకులు ప్రస్తావించడంతో తనకు వినపడలేదని తొలుత చెప్పిన కేటీఆర్... కొద్దిసేపటి తర్వాత వినిపించందంటూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ఇక్కడ లేరని, కానీ తాము రెండు మూడు సార్లు మాట్లాడుకున్నామని కేటీఆర్ చెప్పారు. 

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన గురువారం రాత్రి ఆయన పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు.

పవన్ కల్యాణ్ గురించి ప్రేక్షకులు ప్రస్తావించడంతో తనకు వినపడలేదని తొలుత చెప్పిన కేటీఆర్... కొద్దిసేపటి తర్వాత వినిపించందంటూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ఇక్కడ లేరని, కానీ తాము రెండు మూడు సార్లు మాట్లాడుకున్నామని కేటీఆర్ చెప్పారు. 

పవన్ కల్యాణ్ సినీ ప్రస్థానంతో పాటు రాజకీయ ప్రస్థానం కూడా విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ మిషన్ ను ముందుకు తీసుకుని వెళ్లాలనే కేటీఆర్ తపన స్ఫూర్తిదాయకమైందని రామ్ చరమ్ తేజ్ అన్నారు. టీఆర్ఎస్ విజయానికి ఆయన కేటీఆర్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. టీఆర్ఎస్ విజయాన్ని ఆయన గ్రేట్ విక్టరీగా అభివర్ణించారు. 

కేటీఆర్ కు కూడా వినయ విధేయ రామ అనేది వర్తిస్తుందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?