మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను  మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. మొదటి సారి కలిసిన ఈ కాంబో పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాపై కొన్ని నెగిటివ్ కథనాలు వస్తున్న తరుణంలో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలనీ చిత్ర ప్రమోషన్ డోస్ పెంచింది. 

సినిమాకు సంబందించిన మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'తందానే.. తందానే'  అనే ఈ సాంగ్ చూస్తుంటే బోయపాటి స్టైల్ మరోసారి రెగ్యులర్ గానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఒక ఫ్యామిలీతో హీరో.. వారిలో హీరోయిన్ అండ్ ట్రెడిషినల్ సాంగ్.. ఈ స్టైల్ లో గతంలో బోయపాటి సినిమాల్లో సాంగ్స్ కనిపించిన సంగతి తెలిసిందే. 

అయితే ఎంత రెగ్యులర్ గా ఉన్నా కూడా కరెక్ట్ టైమింగ్ ని వాడుకోవడంలో బోయపాటి దిట్ట. సాంగ్.. యాక్షన్ సీన్.. ఎమోషనల్ సీన్ ఇలా ఏదైనా కరెక్ట్ టైమింగ్ లో ఈ దర్శకుడు ప్రేక్షకుడి అభిరుచుకి తగ్గట్టు వాడుకుంటాడు. ఇప్పుడు ఈ పాట కూడా సినిమాలో అదే తరహాలో ఉంటుందట. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ కు కొదవలేదని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన కైరా అధ్వాని హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ - ప్రశాంత్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.