హీరో రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'వినయ విధేయ రామ'. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్ ని విడుదల చేసింది.

'అన్నయ్య వీడిని చంపెయ్యాలా? భయపెట్టాలా?'.. భయపెట్టాలంటే 10 నిమిషాలు చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే సెలక్ట్ చేసుకో.. అంటూ చెర్రీ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ తో టీజర్ మొదలైంది.

ఆ తరువాత తన ప్రత్యర్ధులకు వార్నింగ్ ఇస్తూ.. 'ఇక్కడ రామ్.. రామ్ కొ..ణి..దె..ల' అంటూ చరణ్ చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో తమిళ నటుడు ప్రశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ లో ఈ ఇద్దరు నటులు కనిపిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.