Asianet News TeluguAsianet News Telugu

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

పెద్ద సినిమాలు రిలీజ్ అంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉన్నాయా...ప్రీమియర్ షోలు వేస్తున్నారా....అసలు ఎన్ని షోలు, ఎన్ని దియోటర్స్ లో విడుదల వంటి విషయాలు చర్చకు వస్తాయి.

six shows for vinaya vidheya rama in andhra
Author
Hyderabad, First Published Jan 7, 2019, 7:54 AM IST

పెద్ద సినిమాలు రిలీజ్ అంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉన్నాయా...ప్రీమియర్ షోలు వేస్తున్నారా....అసలు ఎన్ని షోలు, ఎన్ని దియోటర్స్ లో విడుదల వంటి విషయాలు చర్చకు వస్తాయి. ఇప్పుడు సంక్రాంతి సినిమాల గురించి అదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాని ఆంధ్రాలో రిలీజ్ రోజు ఆరు షోలు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్  ప్లాన్ చేస్తున్నారు.

దిల్ రాజు తను రైట్స్ తీసుకున్న నైజాం, ఉత్తరాంధ్రలో ఆరు షోల ప్లానింగ్ తో ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుకున్నట్లు సమచారం. అయితే ఇంకా ఈ సినిమాకు ఆంధ్రా  ప్రభుత్వం నుంచి ఆరు షోలకు ఫర్మిషన్ రాలేదు. ఆరు షోలు రిలీజ్ రోజు పడితే ఓపినింగ్స్ ని క్యాష్ చేసుకోవచ్చు. ఇదే ఆలోచనలో మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్ ఉంది. రిలీజ్ రోజు క్యాష్ చేసుకోకపోతే రికవరీలు కష్టం అని, చాలా ఎక్కువ రేట్లుకు కొన్నామని ట్రేడ్ లో మాట్లాడుకుంటున్నారు. 

రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. రీసెంట్ గా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ అందించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మించారు. వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, ప్రశాంత్, ఆర్యన్‌ రాజేష్‌, మధుమిత, హిమజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సంబంధిత వార్తలు..

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

 

Follow Us:
Download App:
  • android
  • ios