మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 

సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ఈ వేడుకకు వచ్చిన కేటీఆర్ గారికి గ్రాండ్ వెల్కం. కేసీఆర్ గారి విజన్ ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే తపనతో ఉంటారు. ఆయన గొప్ప నాయకుడు.

సై రా షెడ్యూల్ తో బిజీగా ఉన్న నాన్న నాకోసం వచ్చారు. ఆయన మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమా కథ నేను నాలుగేళ్ల క్రితం విన్నాను. బోయపాటి గారు ఒక లైన్ చెప్పారు.. వెంటనే సినిమా తీస్తారని అనుకున్నాను. కానీ అలా కాకుండా ఆయన ఎంతో కష్టపడి, అభిమానులందరికీ నచ్చే విధంగా సినిమా తీయాలని ఆలోచించి రాసిన కథ ఇది. వ్యక్తిగతంగా ఆయన గురించి చెప్పాలంటే.. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత క్రమశిక్షణతో కూసిన సెట్ నేను బోయపాటి గారి సినిమాలోనే చూశాను.

ప్రతీ హీరో ఒక్కసారైనా బోయపాటి గారితో పని చేయాలనేది నా కోరిక. ఆయనతో పని చేస్తే ఆ కిక్కే వేరు.. అంత గొప్ప వ్యక్తి. దేవిశ్రీప్రసాద్ క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు. భారీ సినిమాలను బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు దానయ్య గారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ మధ్య ఎవరూ జ్యూస్ లు కానీ, కాఫీలు కానీ తాగడం లేదు.. అందరూ 'టీ'నే తాగుతున్నారు.

మనస్పూర్తిగా ఈ చిన్న టీ కప్పు పెద్ద పని సృష్టిస్తుందని నమ్ముతున్నాను. మా బాబాయ్ అన్నీ వదిలేసి పబ్లిక్ ప్లాట్ ఫాం మీదకొచ్చి అందరి కోసం యుద్ధం చేస్తుంటే ఓ పక్కన ఆనందంగా ఉన్నా.. అంత కష్టపడుతున్నారనే బాధ కూడా ఉంది. కానీ మా బాధ కంటే ఇతరుల బాధలను తీర్చే ఓ వ్యక్తి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది'' అంటూ వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి..

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?