సారాంశం
దర్శకుడు బోయపాటి.. రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు బోయపాటి.. రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.
జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఫైనల్ కట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాల వరకు వచ్చింది. రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా చూసిన చిరంజీవి మూడు గంటల నిడివికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరి ఇప్పుడు బోయపాటి కోరిక ప్రకారం మూడు గంటలు ఉంచుతారా..? లేదా..? అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. 'వినయ విధేయ రామ' పూర్తి స్థాయి మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోన్న సినిమా.
మాస్ కమర్షియల్ సినిమాల నిడివి రెండున్నర గంటల కంటే ఎక్కువగా ఉంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా చిరంజీవి అరగంట సినిమాను ఎడిట్ చేయమని ఆదేశించడం ఖాయం. సో ఈ విషయంలో బోయపాటి గుండె రాయి చేసుకోక తప్పదు.
ఇవి కూడా చదవండి..
ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!
చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!
RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!
షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?
చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!
చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?
చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?
ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!