సారాంశం
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం చిత్రదర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ''మన దగ్గరకి ఎవరైనా అవసరమని వస్తే మనం జేబులో నుండి తీసి డబ్బులిస్తాం..
కానీ చరణ్ కడుపులో నుండి కూడా తీసి ఇస్తాడు.. అంత మంచి మనిషి. వారసత్వం అనేది అసమర్దుడికి బరువు.. సమర్ధుడికి బాధ్యత. రాజకీయరంగంలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ గారు, సినిమా రంగంలో చిరంజీవి గారి వారసుడిగా చరణ్ బాబు.. ఇద్దరూ ఆ బాధ్యతను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఒక సమర్ధుడు నిలబడితే వందమంది సమర్ధులను నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది.
దానికి నిట్టనిలువు నిదర్శనం చిరంజీవి గారు. ఈరోజు ఆయన వారసులకు మాత్రమే కాదు.. ఎందరికో రహదారి వేసి నడిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అజైర్ బైజాన్ వెళ్లి అక్కడకి వెళ్లి షూట్ చేశాం. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు'' అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!
చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్
'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!
'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!
రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?
బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?
ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!
చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!
RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!
షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?
చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!