సారాంశం
మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన రామ్ చరణ్-బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సంధర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ లో చరణ్ మాస్ అవతారంలో కనిపించారు. ఈ లుక్ కొందరికి నచ్చినప్పటికీ మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.
మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన రామ్ చరణ్-బోయపాటి సినిమా 'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సంధర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ లో చరణ్ మాస్ అవతారంలో కనిపించారు. ఈ లుక్ కొందరికి నచ్చినప్పటికీ మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.
వాస్తవానికి ఈమూవీకి పెట్టిన సాఫ్ట్ టైటిల్ కు అనుగుణంగా దేవుని పల్లకీ వస్తుంటే ముందుగా రామ్ చరణ్ తెల్లటి లాల్చీ పంచెకట్టులో ఉన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని బోయపాటి రెడీ చేసినట్లు టాక్. పండగ పూట ఈ లుక్ కూడా కరెక్ట్ గా ఉంటుందని భావించారు.
కానీ ఆ విషయం ముందే లీక్ అవ్వడం, చరణ్ మాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేయలేక అప్పటికప్పుడు ఓ గెటప్ తో ఉన్న లుక్ ని విడుదల చేశారు. దీంతో కొందరు ఈ లుక్ పై సెటైర్లు వేస్తున్నారు. చరణ్ మేకోవర్ కొత్తగా లేదని, బోయపాటి మారడా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ లుక్ లో చరణ్ ముఖం సగం మాత్రమే కనిపించడం ఒక కన్ను మూసేయడంతో ఈ యాంగిల్ లో చరణ్ బాడీ లాంగ్వేజ్ బాగాలేదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు విషయం పక్కన పెడితే త్వరలోనే చిత్రబృందం ఈ సినిమా నుండి ఓ ట్రెడిషనల్ పోస్టర్ ని వదులుతారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!
RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!
షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?
చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!
చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?
చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?
ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!