రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి 'వినయ విధేయ రామ' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మెగాఫ్యామిలీ కానీ రామ్ చరణ్ కానీ బోయపాటి ఆటలు సాగనివ్వడం లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో బోయపాటి స్ట్రాటజీలు ఫాలో అవ్వకుండా తనకు నచ్చినట్లుగానే చరణ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. 'జయ జానకి నాయక' సినిమా విషయంలో బోయపాటి మాస్ సినిమాని క్లాస్ మార్కెటింగ్ తో ప్రమోట్ చేశాడు. ఈ సినిమా విషయంలో కూడా అదే చేయాలనుకున్నాడు.

దానికి చరణ్ అంగీకరించలేదు. ఇది మాస్ సినిమా కాబట్టి జనాలు అదే ఫీలింగ్ తో సినిమాకి రావాలని చరణ్ భావిస్తున్నాడు. మార్కెటింగ్ విషయంలో బోయపాటి మాటలు వినడం లేదట. ఫస్ట్ లుక్ విషయంలో బోయపాటి పంచెకట్టుతో సంప్రదాయపు లుక్ రిలీజ్ చేద్దామంటే చరణ్ మాత్రం మాస్ లుక్ వైపే మక్కువ చూపాడు.

అలానే టీజర్ లో కూడా ఎమోషన్ యాడ్ చేయాలని బోయపాటి చూస్తే అది కాదని హీరోయిజం మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. ఎమోషన్స్ తో కూడిన క్లాస్ ఫిలిం అని భావించి జనాలు థియేటర్ కి వచ్చి నిరాశ చెందకుండా చరణ్ ముందు నుండే ఇది మాస్ ఫిలిం అని తెలియాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఇవి కూడా చదవండి..

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!