అమరావతి:చంద్రబాబు ఆర్దిక లావాదేవీలకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.ఆదివారం నాడు అమరావతిలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబుకు ఇల్లు, పవన్ కళ్యాణ్‌కు ఇంటి స్థలం ఇచ్చిన వ్యక్తి ఒకరే కాదా అని ఆయన ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు అవినీతిని అరికట్టడం తప్పా అని  ఆయన  ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని సాక్షాత్తూ మోడీ చేసిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు.

పవన్ పార్టీ ఎజెండా మారలేదన్నారు. అవినీతిని ప్రోత్సహించేలా పవన్ కళ్యాణ్ ప్రకటనలు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కులాల రొచ్చు లేని రాజధాని కావాలని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అమరావతిలో కుంభకోణాలు జరిగాయని మీరే ఆరోపణలు చేసిన విషయం మర్చిపోయారా అని బొత్స ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  ఆ  పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకొన్న అవినీతి గురించి ఏనాడూ ప్రశ్నించలేదన్నారు.రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమని భావించి తాను వైఎస్ఆర్‌సీపీలో చేరినట్టుగా బొత్స వివరణ ఇచ్చారు.జగన్ అంటే వ్యక్తిగతంగా కోపంతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజధాని పేరుతో అవినీతికి పాల్పడిందన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిని గురించి ప్రజలకు చెప్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రాజధానిలో ఇష్టా రాజ్యంగా భూ కేటాయింపులు చేశారన్నారు.

అభివృద్ది పేరుతో దోపీడీ చేశారని ఆయన విమర్శించారు. ఒక్క రాజధాని వెయ్యి కుంభకోణాలు చోటు చేసుకొన్నాయన్నారు.రాజధాని పేరుతో పాల్పడిన అవినీతి బయటపడుతోందని చంద్రబాబునాయుడు, లోకేష్ లు భయపడుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

రాజధానిపై పవన్ వ్యాఖ్యలు: స్ట్రాంగ్ కౌంటరిచ్చిన విజయసాయిరెడ్డి

బొత్స జాగ్రత్తగా ఉండండి, వోక్స్ వ్యాగన్ కేసు ఉంది: పవన్ కళ్యాణ్ వార్నింగ్ 

 కాలం కలిసొచ్చి గెలిచారో, ఈవీఎంలు కలిసొచ్చి గెలిచారో : వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏమో ఈ ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ సీఎం కావచ్చు: పవన్ సంచలన వ్యాఖ్యలు

 

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్