జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి
రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుజనా చౌదరి రైతులకు తెలిపారు. గతంలో రాజధానికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీని ప్రత్యేకంగా చూడడం వల్లే రాజధానికి నిధులు వచ్చాయని చెప్పుకొచ్చారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజధానిలో తనకు గజం స్థలం కూడా లేదని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

హైదరాబాద్: రాజధాని అమరావతి విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. రాజధాని నిర్మాణంపై మంత్రులు మాత్రమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అమరావతి రాజధాని రైతులు హైదరాబాద్ లో సుజనాచౌదరిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు మంత్రుల ప్రకటనలతోపాటు తాము ఎందుర్కొంటున్న సమస్యలను సుజనాచౌదరికి వివరించారు.
తమ సమస్యలపై పోరాటం చేస్తున్న తమకు మద్దతు ఇవ్వాలని సుజనాచౌదరిని కోరారు. సీఎం జగన్ అమరావతిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రాజధాని విషయంలో న్యాయపరంగా పోరాటం చేద్దామని రైతులకు సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని మనం మార్చలేమని, అంతమాత్రాన రాజధానిని మార్చాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనే వ్యాఖ్యలు దురాలాచోనతో చేసినవి అంటూ చెప్పుకొచ్చారు.
రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుజనా చౌదరి రైతులకు తెలిపారు. గతంలో రాజధానికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీని ప్రత్యేకంగా చూడడం వల్లే రాజధానికి నిధులు వచ్చాయని చెప్పుకొచ్చారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజధానిలో తనకు గజం స్థలం కూడా లేదని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మనం బందీలం, మంచో చెడో అంతా కట్టుబడాల్సిందే: రాజధానిపై పవన్ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ తో రాజధాని రైతుల భేటీ: రాజధాని సమస్యలపై ఏకరువు