సారాంశం
రాజధాని భూముల విషయంలో ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి సుజనాపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: రాజధాని భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ఏపీ ప్రభుత్వం మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో తనకు భూములే లేవని ఓ మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీ చెబుతున్నాడని సవాల్ విసిరితే అన్నీ బట్టబయలు చేస్తానని ఆయన బాంబు పేల్చారు.
సోమవారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలో భూ అక్రమాలపై తన వద్ద సమాచారం ఉందన్నారు. సరైన సమయంలో ఈ సమాచారాన్ని బయటపెడతానని ఆయన చెప్పారు.
రాజధానిలో భూములు లేవని ఓ మాజీ కేంద్ర మంత్రి చెబుతున్నారని...ఆయన చిట్టా కూడ తమ వద్ద ఉందన్నారు. భూముల విషయాలను బయటపెట్టాలని సవాల్ చేయాలని మంత్రి బొత్స మాజీ కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు.
రాజధాని నిర్మాణం విషయంలో గతంలో బీజేపీ, జనసేన నేతలు ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి చోటు చేసుకొందని జనసేన, బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
భారీ వర్షం వస్తే అమరావతి నీట మునిగే అవకాశం ఉందని తేలిందన్నారు.11 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వస్తే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. రాజధాని భూముల రైతులు కౌలు కోసం తనను కలిసినట్టుగా ఆయన చెప్పారు.
కౌలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. త్వరలోనే ఆ రైతులకు కౌలు చెల్లించనున్నట్టుగా బొత్స తేల్చి చెప్పారు.ఏపీకి నాలుగు రాజధానుల విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయమై టీజీ వెంకటేష్‌ను అడగాలని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు
అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్
బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ
అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం
ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం
రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స
జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి
ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...
అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే
అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....
రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్
రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్
జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్
జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు
రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు
తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్
అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా
ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?
అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్