అమరావతి: గత వారంరోజులుగా నవ్యాంధ్ర రాజధాని అమారావతి చూట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగష్టు 21న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. అమరావతి తరలిపోదని వైసీపీ చెప్తుంటే కాదు తరలిపోతుందని తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన బీజేపీలు వాదిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే కొందరు నాయకులు అయితే ఏపీకి నాలుగు రాజధానులు అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తుంటే మరికొందరు దొనకొండకు రాజధాని తరలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధాని వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం పెదవి విప్పలేదు. 

అయితే గురువారం జగన్ రాజధాని అమరావతిపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో జగన్ క్లారిటీ ఇస్తారని అటు అమరావతి రైతులతోపాటు అన్ని పార్టీలు ఆసక్తిగా రివ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  

రాజధాని అమరావతి ముంపు ప్రాంతం అంటూ ఆరోపించిన బొత్స సత్యనారాయణ రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలను గందరగోళంలోకి నెట్టేశాయి. 

రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు బీజేపీ జనసేన లెఫ్ట్ పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీని సైతం ఇరకాటంలో పడేశాయి. బొత్స వ్యాఖ్యలను సమర్థించాలో లేక ఏం చేయాలో తోచక కొందరు సైలెంట్ గా ఉంటే కొందరు మాత్రం సమర్థిస్తున్నారు. 

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాద్ధాంతంతో బొత్స సత్యనారాయణ దిగొచ్చారు. తాను రాజధానిని తరలిస్తానని ఎక్కడా చెప్పలేదని చెప్పుకొచ్చారు. దాంతో మెుత్తం వైసీపీ అంతా ఇదే వంతపాడటం మెుదలు పెట్టింది. 

బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవద్దని దానిపై ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్తే అదే ఫైనల్ అని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం సాయంత్రం అమరావతిపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. 

జగన్ రివ్యూపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేసినప్పుడు సీఎం జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి తిరిగి వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా నేటికి ఆయన రాజధానిపై వస్తున్న విమర్శలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 

దాంతో గురువారం రివ్యూలోనైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక ఇంకెక్కడికైనా తరలిస్తారా....లేక నాలుగు రాజధానులు ఉంటాయా, లేక దోనకొండకు తరలిపోతుందా అనే అనుమానాలకు జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇదిలా ఉంటే గురువారం ఉదయం తెలుగుదేశం, సీపీఐ పార్టీల నేతలు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధానిపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో అమరావతి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఇకపోతే ఈనెల 30న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్