ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై మంత్రులు తలా ఓ మాట మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ అన్నారు. గురువారం ఆయన టీడీపీ సీనియర్ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ... కృష్ణా నది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందని అన్నారు. దానివల్లే 6వేల ఎకరాలు నీట మునిగిపోయాయని ఆయన అన్నారు.

పంట నష్టపోయి దాదాపు 10వేల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని గల్లా చెప్పారు. రాజధాని అమరావతిపై మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కి మోదీ, అమిత్ షా మద్దతు ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారన్న విషయాన్నిఈ సందర్భంగా గల్లా గుర్తు చేశారు.

అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడారు. పోలవరం విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు  సీఎం జగన్ తొందరపాటు నిర్ణయానికి చెంపపట్టు అని అన్నారు. అధికారంలోకి రాగానే పోలవరం పవర్ ప్రాజెక్టును కొట్టేయాలని చూశారని.. అందుకే వైఎస్ బంధువు పీటర్ తో కమిటీ చేర్పాటు చేశారని ఆరోపించారు.

పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలను మన భూభాగంలో కలిపేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. ముంపు మండలాలను కలపడం వల్లే ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని చెప్పారు. డ్యామ్‌ సైట్‌ వద్ద ప్రజలను ఖాళీ చేయించేందుకు గతంలో రూ.115 కోట్లు పరిహారం ఇచ్చామన్నారు.2015లోనే డ్యామ్‌ సైట్‌ ఖాళీ అయిపోయిందని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు