అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వంలోనే  బొత్స సత్యనారాయణ సీఎం కావచ్చునేమోనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

బొత్స సత్యనారాయణ మనసులో ఏదో ఒక మూలన సీఎం కావాలనే కోరిక బలంగా ఉందన్నారు. అందుకే ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందు పీసీసీ చీఫ్ గా బొత్స సత్యనారాయణ పనిచేశారని గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలని బొత్స సత్యనారాయణ చాలా ప్రయత్నాలు చేశారని కానీ అవేమీ నెరవేరలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక మాత్రం ఇంకా అలానే ఉండిపోయిందన్నారు. 

బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కావాలనే కాంక్షపై కాకుండా ప్రజలకు మంచి  చేయాలనే ఆలోచన చేస్తే మంచిదన్నారు. రాజధానిపై బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నట్లు తెలిపారు. 

బొత్స సత్యనారాయణ జగన్ మాయలో పడొద్దన్నారు. జగన్ రెడ్డి మాయలో పడితే ఇబ్బందులు పడతారంటూ విమర్శించారు. బొత్స సత్యనారాయణ పెద్దరికం నిలబెట్టుకోవాలని హితవు పలికారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బొత్స జాగ్రత్తగా ఉండండి, వోక్స్ వ్యాగన్ కేసు ఉంది: పవన్ కళ్యాణ్ వార్నింగ్ 

 కాలం కలిసొచ్చి గెలిచారో, ఈవీఎంలు కలిసొచ్చి గెలిచారో : వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు