జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా....

First Published 27, Aug 2019, 12:47 PM

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆనావళ్లను నామరూపాల్లేకుండా చేయాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆనావళ్లను నామరూపాల్లేకుండా చేయాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ రెండింటిని పూర్తి చేస్తే తన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా తన పట్ల ప్రజా విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చునని చంద్రబాబు భావించారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తూ లేదా కొన్నింటి పేర్లు మారుస్తూ వెళ్తున్నారు. అన్నా క్యాంటీన్లను ఇప్పటికే మూసేశారు. ఇతర సంక్షేమ పథకాలకు తనదైన శైలిలో కొత్తగా రూపకల్పన చేస్తూ పేర్లు మార్చేస్తున్నారు. ఆ రకంగా ఆయన చంద్రబాబు పేరు రాష్ట్రంలో కనిపించకూడదనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. దీన్నే తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలుగా భావిస్తున్నారు.

తాజా పరిణామాలను పరిశీలిస్తే.. జగన్ అమరావతికి ఎసరు పెట్టినట్లు కనిపిస్తున్నారు. అమరావతిని పూర్తిగా తరలించకపోవచ్చు గానీ దాని స్థాయిని కుదించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సింగపూర్ తరహాలో అమరావతిని నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా హైదరాబాదు, బెంగళూర్, చెన్నై స్థాయిల్లో నిర్మిస్తానని కూడా చెప్పారు. ఆ నగరాల స్థాయికి అమరావతి చేరుకునేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని ఆయన పట్టుబట్టారు.

చంద్రబాబు ప్రయత్నాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గండికొడుతూ వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. రాజధాని నిర్మాణానికి తగిన సాయం చేయలేదని విమర్శిస్తూ వచ్చారు. అయితే, చంద్రబాబు అధికారాన్ని కోల్పోయి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దాని ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. కృష్ణానదికి వరద నీరు వస్తే మునిగిపోతుందని బొత్స సత్యనారాయణ సహా పలువురు మంత్రులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా వచ్చిన వచ్చిన వరదలను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంది. ఆ వరదలను చూపిస్తూ అమరావతి రాజధానిగా సురక్షితం కాదని వాదిస్తూ వస్తోంది. అందువల్ల ఇక్కడ భారీ భవనాలను నిర్మించడం సరి కాదని చెబుతూ వస్తోంది. దాంతో అమరావతిని కేవలం నామమాత్రం రాజధానిగా ఉంచి, అధికారాన్ని వికేంద్రీకరించే పేరుతో కొన్ని సంస్థలను, కార్యాలయాలను రాయలసీమకు, ఉత్తరాంధ్రకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోంది.

దానికితోడు అమరావతి భూసేకరణలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. రాజధాని ఒక్క సామాజికవర్గానికి చెందింది కాదని అంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమరావతి పేరుతో పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆయన చెబుతున్నారు. తద్వారా ఇతర సామాజిక వర్గాలను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి చెల్లు చీటి పలికితే చంద్రబాబు పాదముద్రలు గానీ ఆయన ప్రతిష్ట గానీ లేకుండా పోతుంది. క్రమంగా ప్రజలు చంద్రబాబు పేరును మరిచిపోయే అవకాశం ఉంటుంది.

పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి వ్యవసాయ, గృహావసరాలకు నీటిని అందుబాటులోకి తెస్తే తన పేరు నిలబడుతుందని ఆయన భావించారు. ఈ ప్రాజెక్టులో కూడా అవినీతి చోటు చేసుకుందని జగన్ అంటున్నారు. దాంతో రివర్స్ టెండరింగ్ కు పూనుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని కాంట్రాక్టర్లను పక్కకు తోసేసే చర్యగా దీన్ని భావిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతిని బయటపెట్టి, తాను చేపడితే చంద్రబాబు పేరు దెబ్బ తింటుందని, తద్వారా పోలవరం ప్రాజెక్టును నిర్మించిన ఖ్యాతి తనకు దక్కుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి తనంత తానుగా తీసుకుంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు తన హయాంలో విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తానే తీసుకుంటుందా, కేంద్రానికి ఆ బాధ్యతలను అప్పగిస్తుందా తెలియదు. మొత్తంగా చంద్రబాబు పేరు తుడిచిపెట్టేందుకు జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.