అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిపైనా, వరదలపైనా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు ముందే రాజధాని రైతులకు కౌలు నిధులు ఇవ్వాలని తాను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కౌలు నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు. 

మంగళవారం రాజధాని రైతులకు సంబంధించి కౌలు నిధులకు గానూ రూ.187 కోట్లు విడుదల చేసినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం నుంచి కౌలు నిధుల పంపిణీ విడుదల జరుగుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని కౌలు డబ్బులు తీసుకోవాలని సూచించారు. 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరిందన్నారు. ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి 8లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ప్రజలకు మంచి పాలన అందిస్తున్నట్లు తెలిపారు. 

కృష్ణా వరదల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నందు వల్లే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. 

వరదలపై ప్రభుత్వం స్పందించలేదని ఏ బాధితుడు చెప్పలేదన్నారు. ఒక్క పెయిడ్ ఆర్టిస్ట్ మాత్రమే ప్రచారం చేశారని అంతేగానీ ప్రజలు కాదన్నారు. విపత్తును ముందుగా గుర్తించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులతో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయించారని విమర్శించారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. వరదలు రావడం, తగ్గిపోవడం జరిగిందని ఆ తర్వాతే చంద్రబాబు పర్యటించారని విమర్శించారు. 

వరదలపై చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. నారా లోకేష్ ట్విట్టర్లో ఏవేవో పెడుతున్నాడని తిట్టిపోశారు. పడవ అడ్డంపెట్టి చంద్రబాబు ఇళ్లు ముంచేశారంటూ చంద్రబాబు, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా, 40ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబుకు సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. పడవ అడ్డుపెట్టుకుని ఇల్లు ముంచుతారా ఇదెక్కడైనా ఉందా అని నిలదీశారు. 

ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా ఇప్పటికీ చంద్రబాబులో మార్పు రావడం లేదన్నారు. చంద్రబాబు ఇకనైనా మారాలని బొత్స హితవు పలికారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

రాజధాని రైతులకు శుభవార్త: రూ.187.44 కోట్లు విడుదల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్