సారాంశం
వ్యక్తుల స్వార్థం, స్వంత ప్రయోజనాలు, కొందరు వ్యక్తుల ప్రాపకం కోసం రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు వక్రీకరించారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజాఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
విశాఖపట్నం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మారుస్తామని తాను అనలేదని స్పష్టం చేశారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని ప్రాంతంలో వరద ముంపు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పానే తప్ప రాజధానిని మార్చేస్తానంటూ ఏనాడు అనలేదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని పక్కన పెట్టిందని చెప్పానని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీని పక్కనబెట్టి ఆనాటి మంత్రి నారాయణ సిఫారసుల మేరకు రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని ఆరోపించారు.
వ్యక్తుల స్వార్థం, స్వంత ప్రయోజనాలు, కొందరు వ్యక్తుల ప్రాపకం కోసం రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు వక్రీకరించారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజాఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
ప్రజల కోసం కాకుండా తన స్వార్థం కోసమే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అవే తాను చెప్పినట్లు తెలిపారు.
కొద్దిపాటి వరదకే ఆ ప్రాంతం మునిగిపోయిందని ఆరోపించారు. ఇక్కడ రాజధాని అయితే భారీగా ఖర్చుపెరుగుతుందని, భవిష్యత్ ఆలోచించి చెప్పినట్లు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి
ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...
అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే
అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....
రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్
రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్
జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్
జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు
రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు
తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్
అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా
ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?
అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్