అమరావతి: రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకొనే అవకాశం  ఉందనే ప్రచారం సాగుతోంది. అమరావతి విషయంలో రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో ఈ విషయమై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.

ప్రభుత్వానికి చెందిన కార్యాలయాన్ని కూడ ఒకే చోట ఏర్పాటు చేయకూడదని కూడ సీఎం జగన్ భావిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది.గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ అభిప్రాయం కూడ ఇదే రకంగా ఉంది. 

కానీ. ఈ కమిటీ నిర్ణయాన్ని గత చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. విజయవాడ, గుంటూరు మధ్య కృష్ణా నది ఒడ్డులో రాజధాని నిర్మాణానికి పూనుకొంది.రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల వివరాలను ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ పి. లక్ష్మి నరసింహం ను సీఎం జగన్ ఆదేశించారు. 

రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం స్వచ్ఛధంగా భూములను సేకరించిందా లేదా ప్రభుత్వం బలవంతంగా రైతులన నుండి భూములను తీసుకొందా అనే విషయాన్ని బయటపెట్టాలని సర్కార్ భావిస్తోంది.

రాజధానిలో నిర్మిస్తున్న ప్రభుత్వ  సంస్థల పక్కనే ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు ఏ మేరకు స్థలాన్ని కేటాయించారనే విషయమై  కూడ ఆ నివేదికలో ఇవ్వాలని సీఎం సీఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించారు.

సీఆర్ డీఏ కమిషనర్ నివేదికను సమర్పించిన తర్వాత ఈ విషయమై సీఎం జగన్ ప్రజాభిప్రాయం కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే