అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధాలపై బిజెపి పార్లమెంటు సభ్యులు ఇరువురు పరస్పరం విభేదిస్తున్నారు. జగన్ తో మోడీ సంబంధాలపై సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ పరస్పర విరుద్ధాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ (టీడీపి)ను వైదొలిగి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. 

పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుచ్ఛక్తి కొనుగోలు ఒప్పందాల (పిపిఎ) రద్దు తర్వాత ఎపి రాజధాని అమరావతి వివాదం ముందుకు వచ్చింది. ఈ విషయాలపై టీజీ వెంకటేష్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు, సుజనా చౌదరి వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మధ్య పొంతన కుదరడం లేదు. 

ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పిన తర్వాతనే జగన్ నిర్ణయాలు తీసుకుంటారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం తలెత్తింది. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను సుజనా చౌదరి ఖండించారు. 

జగన్ తీసుకునే నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని చెప్పి ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయి రెడ్డి ప్రకటనపై సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు టీడీపి ప్రభుత్వ హయాంలో అమరావతి విషయంలో అవినీతి జరిగిందని భావిస్తే ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించవచ్చునని ఆయన అన్నారు 

సుజనా చౌదరి వ్యాఖ్యలతో టీజీ వెంకటేష్ విభేదించారు. నేరుగా సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించకుండా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి కొనసాగకపోవచ్చునని, ఈ విషయంపై జగన్ బిజెపి అధిష్టానంతో చర్చించారని ఆయన అన్నారు. బిజెపి అధిష్టానం తనకు ఆ విషయం చెప్పిందని అన్నారు. 

ఎపికి నాలుగు రాజధానులు వస్తాయని టీజీ అంటూ వాటి పేర్లు కూడా చెప్పారు .విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడపల్లో నాలుగు రాజధానులు ఏర్పాటవుతాయని ఆయన అన్నారు. రాజధాని పేరుతో అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరిస్తే రాయలసీమ ఉద్యం వస్తుందని ఆయన అన్నారు.  

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే