అమరావతి: అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాటలు ఆజ్యం పోశాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరో చోటికి తరలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన పార్టీ నేతలు కూడా జగన్ సర్కార్ పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. 

అమరావతి తరలింపు విషయంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకేటేష్ తాజాగా చేసిన ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయాలను బలపరిచేవిగా ఉన్నాయి. అమరావతి ఎపి రాజధానిగా ఉండకపోవచ్చుననే సంకేతాలు టీజీ వెంకటేష్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, జగన్ ఆలోచన మాత్రం మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అభివృద్ధి అంతా అమరావతి చుట్టే కేంద్రీకృతమవుతోందని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని  ఉత్తరాంధ్ర, రాయలసీమల నుంచి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అసంతృప్తి వ్యక్తమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ రాజధాని విషయంలో మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాజధానితో సమానంగా మెగా సిటీలను అభివృద్ధి చేయాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఆ విషయంపైనే టీజీ వెంకటేష్ మాట్లాడారు. రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉంటాయని ఆయన చెప్పారు. అయితే, టీజీ వెంకటేష్ చెప్పినట్లు అవి రాజధానులు కావని, రాజధాని తరహాలో నాలుగు నగరాలను అభివృద్ధి చేయడమని అంటున్నారు. ఈ స్థితిలో అమరావతి తరలించడం అనేది ఉండదు కానీ, చంద్రబాబు చెప్పినట్లుగా దాని నిర్మాణం జరగదు. అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మాత్రమే ఉంటుంది. 

ఆ విషయంపై జగన్ మూడు నెలల క్రితమే తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వం పెద్దలకు ఓ నివేదిక అందజేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన నోట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అన్ని ముఖ్య కార్యాలయాలు, సంస్థలు ఒకే చోట ఉండడం వల్ల అధికారం కేంద్రీకృతమవుతుందని, అధికారాన్ని వికేంద్రీకరించే విధంగా కొన్ని సంస్థలను రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ పెడుతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

టీజీ వెంకటేష్ చెప్పిన నాలుగు రాజధానులు గుంటూరు, కడప, విజయనగరం, కాకినాడల్లో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బహుశా, అవి ప్రాంతీయ మండళ్ల రూపాలే కావచ్చు. ఎపి హైకోర్టును మాత్రం రాయలసీమకు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో తాము వివక్షకు గురవుతున్నామనే అభిప్రాయాన్ని ఆ ప్రాంతాల ప్రజల నుంచి దూరం చేయగలుగుతామని జగన్ భావిస్తున్నట్లు సమాచారం 

అందులో భాగంగానే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను జగన్ నియమించారు. దానికితోడు శ్రీబాగ్ ఒడంబడికను దృష్టిలో ఉంచుకుని రాజధాని ప్రాంతంలోని కొన్ని కార్యాలయాలను ఆయా ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ఐదు రాజధానుల్లో ఒక్కటి అమరావతి. అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉంటుంది. 

ఉత్తరాంధ్ర ప్రణాళిక బోర్డులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. దాని కార్యాలయం బహుశా విజయనగరంలో ఏర్పాటు కావచ్చు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కోసం ఏర్పాటు చేసే ప్రణాళిక బోర్డు కేంద్రం కాకినాడలో ఏర్పాటు కావచ్చు. ఇందులో అమరావతి ప్రాంతం కూడా ఉండే అవకాశం ఉంది. 

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం ఏర్పాటయ్యే ప్రాంతీయ మండలి కేంద్రంగా గుంటూరు ఉండవచ్చు. రాయలసీమలోని నాలుగు జిల్లాల కోసం ఏర్పడే ప్రాంతీయ బోర్డు కేంద్రంగా కడప ఉండవచ్చు. ఈ ప్రాంతీయ బోర్డుల కేంద్రాలనే బహుశా టీజీ వెంకటేష్ రాజధానులుగా చెప్పి ఉంటారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే