అమరావతి: అమరావతి వరద ముంపు ప్రాంతమని తెలుగుదేశం పార్టీ నేతలే ఒప్పుకొన్నారని ఏపీ పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

గురువారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.అమరావతి వరద ముంపు ప్రాంతమన్నారు. 11 వేల క్యూసెక్కుల నీరు వస్తేనే ఈ ప్రాంతమంతా నీటిలో ముంపుకు గురైందన్నారు. గతంలో టీడీపీ నేతలు ఈ విషయాన్ని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అమరావతిలో 13,500 క్యూసెక్కుల నీరు వస్తేనే ముంపుకు గురయ్యే అవకాశం ఉందని లోక్‌సభలో చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

జాతీయ గ్రిన్ ట్రిబ్యునల్ లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో కూడ ఇదే విషయాన్ని పేర్కొందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సింగపూర్ కన్సార్టియం  కంపెనీ కూడ  మాస్టర్‌ప్లాన్ లో కూడ ఈ విషయాన్ని తేల్చి చెప్పిందన్నారు.

లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా గల్లా జయదేవ్ ఈ విషయమై మాట్లాడిన మాటలను మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.  అమరావతిని ప్రకృతి ప్రకోపాల నుండి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.  ముఖ్యంగా వరదలు ఇతర ప్రకృతి విపత్తుల నుండి రక్షించేందుకు అవసరమైన ప్రత్యేక కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

అమరావతిలోని 54 కి.మీ పరిధిలోని 13,500 ఎకరాలు వరద ప్రభావిత ప్రాంతంలో ఉందని గల్లా జయదేవ్ ఆనాడు తన ప్రసంగంలో ప్రకటించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.1096 కోట్లతో వరదను నియంత్రించేందుకు రక్షణ చర్యలు తీసుకొంటున్నట్టుగా చెప్పిన విషయాన్ని  మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు.

సింగపూర్ కన్సార్టియం కంపెనీ తాను తాయరు చేసిన మాస్టర్ ప్లాన్ లో కొండవీగు, కృష్ణానది పరివాహక ప్రాంతం 453 కి.మీ ఉంటుందని ప్రకటించింది.

కొండవీడు గుట్టల ప్రాంతంలో ఉద్భవించిన కొండవీటి వాగు ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగంలో కలవనుందని ఈ నివేదికలో తెలిపింది.

కొండవీటి వాగు ప్రతి ఏటా ప్రవహిస్తోందని సింగపూర్ కన్సార్టియం తన నివేదికలో స్పష్టం చేసింది. వర్షాకాలంలో అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు 13,500 ఎకరాలను ముంచెత్తే అవకాశం ఉందని  కూడ పేర్కొంది.

 అమరావతి ప్రాంతంలోని లోతట్టు  ప్రాంతాల్లో కనీసం ఐదు నుండి ఏడు రోజుల వరకు వరద ప్రవాహం ఉండే అవకాశం ఉందని  సింగపూర్ కన్సార్టియం ప్రకటించింది. అమరావతి ప్రాంతంలో 10,600 ఎకరాల్లో ఈ ప్రమాదం ఉంటుందని ఆ నివేదిక చెబుతుంది. కొండవీటి వాగు వరద కొంత ఇబ్బందికరమైన పరిణామమని కూడ ఆ నివేదిక తెలిపింది.

కాలక్రమంలో కొండవీటి వాగుకు వరదలు తక్కువయ్యాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. అయితే సీజనల్ లో (వర్షాకాలంలో)  కొండవీటి వాగు వరద ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది.

అమరావతి ప్రాంతానికి వరద ముంపు ఉందని టీడీపీ ప్రభుత్వం అంగీకరిస్తూనే ఈ విషయాలను కూడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలిపింది.అమరావతి వరద ముంపు ప్రాంతమని ప్రచారం చేస్తూ ఇక్కడి నుండి రాజధానిని తరలించేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు చేస్తోందని  టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్