ఏపీ రాజధాని అమరావతిపై గందరగోళం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. భేటీ వివరాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు.

64,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధానికి భూములిచ్చారని బొత్స గుర్తుచేశారు. వీరిలో 43 వేల మందికి ప్లాట్లు ఇచ్చామని.. వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని మంత్రి తెలిపారు.

రాజధాని రైతులకు పెన్షన్‌తో పాటు కౌలు కూడా విడుదలయ్యిందని సీఎంకు వెల్లడించినట్లు బొత్స వెల్లడించారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. రేపటి నుంచి కౌలు రైతులకు చెక్కుల పంపిణీ చేస్తామన్నారు.