అమరావతి: అమరావతి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి విషయంపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకు వేసి మాట్లాడారు. అమరావతికి ముంపు ప్రమాదం ఉందనే మాట నుంచి అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ దాకా వెళ్లారు.

అమరావతి స్థాయిని తగ్గించడం వెనక తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే వ్యూహం కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. వైఎస్ జగన్ వ్యూహానికి అనుగుణంగా బొత్స సత్యనారాయణ అమరావతిపై మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. అమరావతిపై అనుమానాలతో ఇప్పటికే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు పట్టింది. 

శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కకు తోసేసి గత చంద్రబాబు ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి, ఆ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఎపి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసింది. గుంటూరు, విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు భావ్యం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అయితే, చంద్రబాబు అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కమిటీని వేసి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంతోనే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులకు భూములు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. అదే హామీని బిజెపి కూడా ఇచ్చింది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై జగన్ కోలుకోలేని దెబ్బ వేశారు. 

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రాంతంలో భూఅక్రమాలు జరిగాయని బొత్స సత్యనారాయణ అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినవారు, ఆ పార్టీకి సన్నిహితంగా ఉండేవాళ్లు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్నారు. తాజా పరిణామాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తిన్నది. అపార్టుమెంట్లు, కాంప్లెక్స్ ల నిర్మాణాలు ఆగిపోయాయి. వీటిలో ఎక్కువగా టీడీపి నేతలు, వారికి సంబంధిచినవారే పెట్టుబడులు పెట్టారనేది వినిపిస్తున్న మాట. 

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే ప్రచారంతో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనే కాకుండా విజయవాడ, గుంటూరుల్లోనూ, ఆ నగరాల పరిసరాల్లోనూ భూముల ధరలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది.

అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించగానే ఆ ప్రాంతాల్లో భూములు కొనడానికి వివిధ ప్రాంతాలకు చెందినవారితో పాటు ఎన్నారైలు కూడా క్యూ కట్టారు. దీంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రాజధాని ప్రాంతంలోని భూముల రిజిస్ట్రేషన్ ను చేసే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కిటకిటలాడుతూ వచ్చింది. దాని ఆదాయం కొన్ని వారాల్లో కోట్లకు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఎన్నికల ఫలితాలు వెలువడగానే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది. దాదాపు 75 శాతం తగ్గినట్లు అనధికారిక లెక్కలు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కూడా భూముల ధరలు గణనీయంగా పడిపోయాయి. వాటిని కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అదే సమయంలో తాడేపల్లిలోని భూముల రేట్లు పెరిగాయి. 8 లేన్ ఎక్స్ ప్రెస్ రోడ్డు వేస్తామని ప్రకటించడంతో ఇక్కడి భూముల ధరలు పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే