రాజధాని తరలిపోతుంది, కృష్ణావరదలు వైసీపీ కుట్రే: బొత్స కు దేవినేని ఉమా కౌంటర్
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పనికిరాదని తెలియజేసేందుకే వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నిందని అది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో బట్టబయలైందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాజధాని గ్రామాల్లోకి నీటిని పంపారంటూ ఆరోపించారు.
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించే కుట్ర జరుగుతోందంటూ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. తాము మెుదటి నుంచి రాజధానిని తరలించుకుపోతారని ఆరోపిస్తున్నామని తాము భావించినట్లుగానే జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు.
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పనికిరాదని తెలియజేసేందుకే వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నిందని అది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో బట్టబయలైందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాజధాని గ్రామాల్లోకి నీటిని పంపారంటూ ఆరోపించారు.
వరదలు సహజంగా వచ్చినవి కాదని కావాలనే నీటిని రాజధాని భూముల్లోకి మళ్లించారంటూ ఆరోపించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
ఇకపోతే నవ్యాంధ్ర రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రరాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజధాని నిర్మాణంలో ఖర్చు చేయాల్సినదానికంటే అధికంగా ఖర్చు చేశారని నిధుల దుర్వినియోగంపైనా విచారణ జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని తరలిపోయే కుట్ర జరుగుతోందంటూ మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్
అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే