విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతిధి వేదవ్యాస్. రాజధానిని కుట్రపూరితంగా తరలించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ముంపు ప్రాంతంగా అమరావతికి ముద్రవేసి రాజధానిని వేరే చోటకు షిఫ్ట్ చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయమన్నారు. వరదలను భూతద్దంలో చూపించి రాజధాని నిర్మాణం ఆపాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

రాజధాని అమరావతి అంటేనే వైసీపీకి ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని అడ్డుకుంటూనే ఉన్నారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం జరగకూడదని వైయస్ జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.  

వరద ప్రభావానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న ప్రాంతాలేవీ మునగలేదని చెప్పుకొచ్చారు. అయితే సీఎం వైయస్ జగన్ మనుషులు భూములు కొన్నందున‌‌ రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకి మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలతో ఏపీలో జగన్ చాప్టర్ క్లోజ్ అవుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. అనుభవం లేని పాలన కారణంగా ఏపీ అధోగతి పాలైందని వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వరదలు ప్రభుత్వం సృష్టించిన విపత్తు, రైతులకు అండగా ఉంటాం: చంద్రబాబు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే