తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్
వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చడం ఖాయమన్నారు. అయితే.. రాజధానిని దొనకొండకు మార్చడం మాత్రం కరెక్ట్ కాదని సూచించారు. తిరుపతిని రాజధాని చేయాలని సూచించారు.
తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గా చేయాలని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతా మోహన్ కోరారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానిని మారుస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి పై చేసిన కామెంట్స్ ఇందుకు ఊతమిచ్చాయి. ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉండగా... దానిని తరలించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాజీ ఎంపీ చింతామోహన్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చడం ఖాయమన్నారు. అయితే.. రాజధానిని దొనకొండకు మార్చడం మాత్రం కరెక్ట్ కాదని సూచించారు. తిరుపతిని రాజధాని చేయాలని సూచించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్... కేంద్రంతో చర్చలు జరిపారని చింతా మోహన్ పేర్కొన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ తొందరపడటం కరెక్ట్ కాదని.. రాజధానికి దొనకొండ ఆమోదయోగ్యం కాదని అని ఆయన అన్నారు. అన్ని వనరులు ఉన్న తిరుపతిని రాజధాని చేయడం శ్రేయస్కరమని చెప్పారు. రాజధాని మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో... రాజధానికి భూములు ఇచ్చిన రైతులు భయాందోళనలకు గురౌతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా
ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?
అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్
అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్
అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే