అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో భూముల ధరలు పడిపోయాయి. దీంతో రియల్ ఏస్టేట్ వ్యాపారులు  దిక్కుతోచని స్థితిలో నెట్టివేయబడ్డారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై మరింత గందరగోళానికి కారణమయ్యాయి.

అమరావతిలో నిర్మాణ పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాజధానిపై వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. అయితే  మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతతను సంతరించుకొన్నాయి.

అమరావతి ప్రాంతంలో గతంలో భూముల ధరలు విపరీతంగా ఉండేవి. క్రమంగా భూముల ధరలు పడిపోతున్నాయి.   గతంలో ఎకరం భూమి ధర సుమారు. రూ. 2 కోట్లు కూడ ఈ ప్రాంతంలో పలికింది. కానీ, ప్రస్తుతం ఎకరం ధర రూ. 45లక్షలకు పడిపోయినట్టుగా రియల్టర్లు చెబుతున్నారు.

1.25 ఎకరాల్లో  గేటేడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ సంస్థ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో 40 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ స్థలంలో 116  ఫ్లాట్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు.  అయితే మార్కెట్ లో మారిన పరిస్థితుల కారణంగా అమ్మకాలు పడిపోయాయి. దీంతో నిర్మాణం విషయంలో రియల్ వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు.

అమరావతిలో ప్రభుత్వ పాలన కోసం మాత్రమే భవనాలు నిర్మిస్తారా... పూర్తిస్థాయి రాజధానిగా ఉంటుందా అనే విషయమై ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రాలేదు.  దీంతో రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

2014లో చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చిన తర్వాత రాజధాని కోసం అమరావతిని ఎంపిక చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారు. ఎన్ఆర్‌లు కూడ ఇక్కడ భూములను కొన్నారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ప్రారంభం కావడంతో రియల్ వ్యాపారం కూడ జోరందుకొంది. 

రెండు మాసాలుగా అమరావతి ప్రాంతంలో రియల్ వ్యాపారం తిరోగమనంలో ఉంది. ప్రభుత్వం మారడంతో పాటు కొత్త ప్రభుత్వం రాజధాని విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనే విషయమై స్పష్టత లేని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.

రాజధాని ప్రాంతంలో సుమారు రూ. 10వేల కోట్ల ప్రాజెక్టులు అమ్మకాలు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 

ఇప్పటికే సుమారు 20వేల ఫ్లాట్లు నిర్మాణం పూర్తై అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.  మరో 10 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి.కానీ వీటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

సంబంధిత వార్తలు

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే