దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

‘‘అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశాడు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

mp vijayasai reddy allegations on Kodela

కోడెల శివప్రసాద్... ఐదు కోట్ల ప్రజల పరువు తీశారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలోని ఫర్నీచర్ ని కోడెల తీసుకువెళ్లడంపై గత రెండు రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై తాజాగా విజయసాయి రెడ్డి స్పందించారు. స్పీకర్ హోదాలో ఉండి దొంగతనం చేస్తారా అంటూ మండిపడ్డారు.

‘‘అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశాడు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా... ఇప్పటికే ఈ విషయంపై మాజీ స్పీకర్ కోడెల స్పందించారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు.  అసెంబ్లీ తనకు దేవాలయం లాంటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన వెంటనే అసెంబ్లీ అధికారులకు లేఖ రాశానని.. ఫర్నీచర్ తీసుకెళ్లండి..లేదంటే డబ్బులు తీసుకెళ్లండని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కొత్త అసెంబ్లీకి ఫర్నీచర్‌ను సీఆర్‌డీయేనే సమకూర్చిందన్నారు.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios