న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను సంప్రదించిన తర్వాతే ఏపీ సీఎం వైఎస్ జగన్  నిర్ణయాలు తీసుకొంటున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు భేటీ అయ్యారు.ఆ తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు చెప్పిన తర్వాతే ఈనిర్ణయాలు తీసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు.

ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఆశీస్సులు తమకు ఉన్నాయన్నారు. రాజధానిని మారుస్తామని ప్రభుత్వం ప్రకటించలేదన్నారు.  కొండవీటి వాగు వల్ల  రాజధాని ప్రాంతంలో వరద ముంపుందన్నారు. 

అయితే ఈ వరదను నివారించేందుకు ఏం చేయాలనే దానిపై  ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.రాజధాని మార్చుతున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయంలో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయంలో తమకు కేంద్రం సహకారం కూడ ఉందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే