రోజా ఇంటికి కేసీఆర్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 12, 2019, 5:42 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ఎలా పాలించాలో నేర్చుకోండి: వైఎస్ఆర్‌సీపీపై బాబు

పోలవరం ప్రాజెక్టు విషయంలో  వైఎస్ార్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.

 

అప్పట్లో కేసీఆర్ పై రోజా బార్, దర్బార్ వ్యాఖ్యలు: ఇప్పుడు వేచి ఉండి స్వాగతం

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై రోజా గతంలో తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో ఉన్న సమయంో రోజా కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మాత్రం కేసీఆర్ కు ఆమె స్వాగతం పలికారు. 

 

నిండిన జలాశయాలు: అన్నదాత ముఖాల్లో ఆనందాలు నింపాలంటూ జగన్ ట్వీట్

ఈ నేపథ్యంలో సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

 

జగన్ దమ్మున్న సీఎం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

సామాజిక న్యాయంతో చట్టాలు చేసిన దమ్ము సీఎం జగన్ కు ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల ఎంపికపై టీడీపీ వాళ్లు పిటీషన్లు వేసినా భయపడొద్దని సూచించారు. ఆగష్టు 18 తర్వాత గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పర్యటిస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. 

 

రేయ్.. రారా...డ్యూటీలో ఉన్న సీఐపై వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

సీఐను రేయ్ రారా అంటూ మాట్లాడుతుండటంతో అంతా నివ్వెరపోయారు. సీఐ మురళీధర్ రెడ్డి దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. నా ప్రణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏంటి..? నా పక్కన కూర్చో అంటూ చెప్పుకొచ్చారు. 
 

 

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై పోలీసు కేసు

కోటం రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డిపై సీఎం జగన్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 

జగన్ పై" జయహో" పుస్తకం: ఆవిష్కరించిన సీఎం

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తాను చేసిన పాదయాత్రను జీవితంలో మరచిపోలేనన్నారు జగన్. 14నెలల పాటు సాగిన పాదయాత్రలో ప్రతీ పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే ఎన్నడూ లేనివిధంగా 50శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయని జగన్ స్పష్టం చేశారు. 

 

అర్ధరాత్రి సోదాలు, నాకు రూల్స్ చెబుతున్నారు: ఇది కక్ష సాధింపేనన్న కోడెల

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని.. ఆ బాధితుల్లో తాను ఒకడినని కోడెల వాపోయారు. ఇన్ని కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే.. పోలీసుల వద్ద సమాధానం లేదన్నారు. సుధీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో శాఖల్లో మంత్రి పదవులు నిర్వహించని తనకు పోలీసులు నిబంధనలు చెప్పడం విడ్డూరంగా ఉందని కోడెల ధ్వజమెత్తారు.

 

నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు, పలువురు వైసీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేసీఆర్ నగరి చేరుకున్నారు. అక్కడ స్ధానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఆయనకు ఘనస్వాగతం పలికారు

 

బెజవాడలో భార్యను చంపిన భర్త: ఇంకా దొరకని మణిక్రాంతి తల

విజయవాడ సత్యనారాయణ పురంలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన వివాహిత మణిక్రాంతి తల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమె తల కోసం ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా బుడమేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపుకు ఆటంకం ఏర్పడింది

 

కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి వెళ్లనున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబసమేతంగా కంచిలోని అత్తివరద రాజస్వామిని దర్శించుకోనున్నారు.

 

భారీగా తగ్గిన చికెన్ ధర

వేసవిలో ఎండలకు కోళ్లు ఎక్కువగా చనిపోయాయని... అందుకే ధర ఎక్కువగా పలికాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కోళ్ల లభ్యతగా ఎక్కువగా ఉండటంతో.. ధరల్లో తేడా వచ్చింది. ధర తగ్గడం మాత్రమే కాదు.. చికెన్ వినియోగం కూడా బాగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.  

 

తెలంగాణలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ: బీజేపీలోకి కీలక నేత

గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు అధిష్టానం తమకు టిక్కెట్ ఇవ్వలేదని, గెలవలేనప్పుడు అంటే 2009లో సీటు ఇచ్చారని, అదే 2014లో తాను గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ టిక్కెట్ ఇవ్వకపోవడం తనకు చాలా బాధకలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. 
 

 

అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చిన భర్త

ఇకపోతే బషీర్ అహ్మద్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని భార్యలిద్దరూ సొంత అక్కచెల్లెళ్లు కావడం విశేషం. రెండో భార్య సమీరపై అనుమానం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం కారణంగా వేధిస్తుండటంతో సమీర గోల్కొండ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేసిందని అయితే కోర్టు బషీర్ అహ్మద్ కు ఫైన్ విధించిందని తెలిపారు. 

 

కేటీఆర్ దేశభక్తి వ్యాఖ్యలు: తత్వం బోధపడిందా అంటూ విజయశాంతి సెటైర్లు

మాతో ఉంటే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు అన్న చందంగా బిజెపి రాజకీయం చేస్తోందని కేటీఆర్ చాలా భావోద్వేగంతో కామెంట్ చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆరోపించారు.  

 

వైఎస్‌ను పీసీసీ చీఫ్‌ను చేసింది నేనే: వీహెచ్

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసింది నేనే.... బతికున్నంత కాలం వైఎస్ఆర్ తనను పల్లెత్తు మాట అనలేదని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు.

 

బిజెపిలో చేరికలు: తెలంగాణలో టీడీపీ ఖతమ్

2014 ఎన్నికల తరువాత తెలంగాణ టీడీపీ ఆఫీస్ దాదాపుగా ఖాళీ అయ్యింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల లాభం జరగకపోగా తీవ్ర నష్టం వాటిల్లింది. దీనితో తెలంగాణ టీడీపీ నాయకులకు ఒక విషయం మాత్రం  అర్థమయ్యింది.

 

'మీరు ఇంకా వర్జినా'.. అభిమాని ప్రశ్నకు రెచ్చిపోయిన స్టార్ హీరో!

పలువురు సినీ తారలు అభిమానులకు చేరువగా ఉండేదుకు సోషల్ మీడియాని ఉపయోగించుకుంటుంటారు. కానీ కొన్ని సార్లు సోషల్ మీడియా వల్లే తరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు చాలా సాధారణం. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాము. 

 

తాగి కొడుతున్నాడని.. భర్తపై కేసు పెట్టిన టీవీ నటి!

ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ్‌ కోహ్లిని పోలీసులు ముంబైలో అరెస్టుల చేశారు. ఆయనపై భార్య శ్వేత గృహహింస కేసును నమోదు చేశారు.  అంతేకాకుడా  శ్వేత కుతూరు పాలక్‌ తివారీకి అతను అసభ్య ఫొటోలను చూపించినట్టు అభియోగాలు వినిపిస్తున్నాయి.
 

 

బిగ్ బాస్3: నెక్స్ట్ వీక్ మరో ట్విస్ట్.. స్పెషల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బుల్లితెరపై బిగ్ బాస్ 3 గట్టిగానే హీటెక్కుతోంది. నాగార్జున హోస్ట్ లో ఈ రియాలిటీ షో మొదట్లో నార్మల్ గానే అనిపించినా రోజులు గడుస్తున్న కొద్దీ హౌజ్ వాతావరణం రోజుకో వివాదంతో మలుపులు తిరుగుతోంది. ఫైనల్ గా అందరూ ఉహించనట్టుగానే మూడవ ఎలిమినేషన్ లో తమన్నా సింహాద్రికి చేదు అనుభవం తప్పలేదు.  

 

లేడీ ఫ్యాన్ చర్యతో చిరాకుపడ్డ స్టార్ హీరో!

సల్మాన్ ని ఓ మహిళా అభిమాని బాగా ఇబ్బంది పెట్టేసింది. సెక్యురిటీని తప్పించుకొని నేరుగా సల్మాన్ దగ్గరకి వచ్చిన లేడీ ఫ్యాన్ అతడితో సెల్ఫీ తీసుకోవాలని అతడి చేయి పట్టుకొని లాగేసింది. ఆమె చర్యతో సల్మాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

 

బాలయ్యని అలా వాడుకుంటున్న ప్రభాస్.. చీటింగ్ కాదు కదా!

బాలయ్యని ప్రభాస్ వాడుకోవడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోవలసిందే. ప్రభాస్ నటిస్తున్న సాహో ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు.. దర్శకుడు సుజీత్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మెదడుకు పనిపెట్టే సినిమాలా కూడా అనిపిస్తోంది. ప్రభాస్ కు సవాల్ విసిరే విలన్స్ చాలా మందే ఈ చిత్రంలో ఉన్నారు. 

 

అఫీషియల్: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ

 విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ సినిమా చేయనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. లైన్ ప్రొడ్యూసర్ ఛార్మి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలిపింది. 

 

బికినిలో లేడి ఎంపీ.. వైరల్ అవుతున్న ఘాటు ఫోజులు!

నుస్రాత్ జాహాన్.. కొన్ని నెలల క్రితం ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫాలో అయినవాళ్లు ఈ పేరు వినే ఉంటారు. 29లో ఈ అందాల నుస్రాత్ ఎన్నికల్లో సంచలనమే సృష్టించింది. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున నుస్రాత్ ఎంపీగా పోటీ చేసి భారీ విజయం దక్కించుకుంది.  

 

'కొబ్బరి మట్ట' షాకింగ్ కలెక్షన్స్.. స్టార్ హీరోలను మించి..!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బాక్సాఫీస్‌ను బర్న్ చేశాడు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఊహించని కలెక్షన్లతో స్టార్ హీరో సినిమాలను వెనక్కినెట్టి సంపూర్ణేష్ బాబు సత్తా చూపిస్తున్నాడు.
 

పార్టనర్ కోసం కాజల్ వెయిటింగ్..!

గతంలో తమన్నాతో కలిసి కాజల్ నిర్మాణ రంగంలోకి దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ స్వయంగా  వెల్లడించింది. మరో మంచి పార్టనర్ కోసం చూస్తున్నట్లు కాజల్ చెప్పింది. 

 

విజయ్ దేవరకొండ కి ఏమైంది..?

'డియర్ కామ్రేడ్' రిజల్ట్ కారణంగా విజయ్ డిప్రెషన్ మోడ్ లో ఉన్నాడా..? లేక మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడా..? అనేది ఫ్యాన్స్ కి అర్ధంకాక అతడి పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు

 

మితిమీరిన అభిమానం.. సారీ చెప్పిన సూపర్ స్టార్!

మమ్ముట్టి నటించిన 'పెరంబు' సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అలాంటిది ఆ సినిమాకి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదనే విషయాన్ని ఆయన 
అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అవార్డు కమిటీపై ఆరోపణలు చేయడంతో పాటు నేషనల్ అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్ రవిపై సోషల్ మీడియాలో దాడికి దిగారు.

 

'కొబ్బరిమట్ట' రిలీజ్ చేయలేదని సెల్‌టవరెక్కిన ఫ్యాన్!

'కొబ్బరిమట్ట' సినిమా శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైనప్పటికీ మదనపల్లెలో మాత్రం విడుదల కాలేదు. దీంతో రెడ్డెప్ప తన స్నేహితులతో కలిసి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విడుదల చేయాలని దర్శకనిర్మాతలను కోరాడు. 

 

మన్మథుడుకి దెబ్బేసిన కొబ్బరిమట్ట

చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ హిట్ సౌండ్ వినబడుతోంది. సంపూర్ణేష్ బాబు కల్మషం లేని కామెడీ సినిమా కొబ్బరిమట్ట హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. పోటీగా కింగ్ మన్మథుడు 2 ఉన్నప్పటికీ కొబ్బరిమట్ట మాస్ ఆడియెన్స్ సపోర్ట్ తో మంచి లాభాలను అందుకుంటోంది. 

 

ప్రభాస్ నోటి నుంచి సాహో అసలు బడ్జెట్ లెక్క.. అంతా షాక్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, ప్రభాస్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో అమిర్, షారుఖ్, సల్మాన్ చిత్రాల తరహాలో సాహో చిత్రానికి క్రేజ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

click me!