టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి వెళ్లనున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబసమేతంగా కంచిలోని అత్తివరద రాజస్వామిని దర్శించుకోనున్నారు.

సోమవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి కంచికి చేరుకుంటారు. మార్గమధ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రోజా ఇంటికి వెళ్లనున్నారు.

ఉదయం 9 గంటలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అక్కడే చేయనున్నారు. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.