టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. కేవలం తన సినిమాల రిలీజ్ టైంలో మాత్రమే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తరచూ ట్వీట్లు చేయడం, అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం వంటివి చేస్తుంటాడు.

కానీ గత రెండు వారాలుగా ఆయన నుండి ఒక్క ట్వీట్ కూడా  లేదు. జూలై 26న విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా రిలీజ్ రోజు తన ఫాలోవర్లను పలకరించాడు. సినిమా చూసిన ఎంజాయ్ చేయమని చెప్పిన విజయ్ ఆ తరువాత ఒక్క పోస్ట్ కానీ ట్వీట్ కానీ షేర్ చేయలేదు. సినిమాను ఆన్లైన్ ప్రమోట్ చేయలేదు.

బయట కూడా సక్సెస్ మీట్ లో తప్ప ఇంకెక్కడ కనిపించలేదు. విజయ్ గనుక వీక్ డేస్ లో సినిమాను ప్రమోట్ చేసి ఉంటే సినిమాకు కలెక్షన్లు వచ్చేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ విజయ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కాబట్టి ప్రమోట్ చేయలేదని సరిపెట్టుకోవచ్చు కానీ ట్విట్టర్ లోకి రాకపోవడం, అభిమానులతో మాట్లాడకపోవడం వంటి విషయాల కారణంగా ఫాలోవర్లు నిరాశ చెందుతున్నారు. 

'డియర్ కామ్రేడ్' రిజల్ట్ కారణంగా విజయ్ డిప్రెషన్ మోడ్ లో ఉన్నాడా..? లేక మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడా..? అనేది ఫ్యాన్స్ కి అర్ధంకాక అతడి పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు!