సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూస్తూనే ఉన్నాం. అభిమానులు సెల్ఫీల కోసం వారి వెంటబడుతుంటారు. కొందరైతే సెలబ్రిటీల మీదకు దూసుకొస్తుంటారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఎదురైంది. 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీసెంట్ గా ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ షోకి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ కూడా ఈ స్క్రీనింగ్ కి హాజరయ్యారు.

షో పూర్తైన తరువాత బయటకి వచ్చిన సల్మాన్ ని ఓ మహిళా అభిమాని బాగా ఇబ్బంది పెట్టేసింది. సెక్యురిటీని తప్పించుకొని నేరుగా సల్మాన్ దగ్గరకి వచ్చిన లేడీ ఫ్యాన్ అతడితో సెల్ఫీ తీసుకోవాలని అతడి చేయి పట్టుకొని లాగేసింది. ఆమె చర్యతో సల్మాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే బాడీగార్డ్స్ ఆమెని వెనక్కి లాగడంతో సల్మాన్ తేరుకున్నాడు.

అతడి ముఖకవళికలు మారిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సల్మాన్ ప్లేస్ లో మరెవరైనా ఉంటే సీరియస్ అయ్యేవారని.. భాయ్ కోపాన్ని కంట్రోల్ చేసుకొనివిచక్షణతో వ్యవహరించారని కామెంట్స్ చేస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SalmanKhan does not appreciate a fan pulling him like this

A post shared by Viral Bhayani (@viralbhayani) on Aug 10, 2019 at 6:40am PDT