యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, ప్రభాస్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో అమిర్, షారుఖ్, సల్మాన్ చిత్రాల తరహాలో సాహో చిత్రానికి క్రేజ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని భాషల్లో అభిమాన హీరోగా మారిపోయాడు. 

ఆగష్టు 30న విడుదలవుతున్న సాహో చిత్రం కోసం జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. ట్రైలర్ లాంచ్ తర్వాత సాహో టీం మీడియాతో ముచ్చటించింది. ఈ మీడియా సమావేశంలో ప్రభాస్ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. సాహో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోందని తెలుసు. కానీ నంబర్ విషయంలో అనేక ఊహాగానాలు ఉన్నాయి. 

150 కోట్ల నుంచి మొదలైన సాహో బడ్జెట్ లెక్క ఆ తర్వాత 200 కోట్లకు చేరింది. మరికొందరు 300 కోట్లు అంటూ ప్రచారం చేశారు. దీనిపై ప్రభాస్ తాజాగా స్పందించాడు. సాహో చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరెకెక్కించినట్లు పేర్కొన్నాడు. నిజంగా  ఇది షాకింగ్ బడ్జెట్. ఓ యువ దర్శకుడుని నమ్మి ఇంత బడ్జెట్ వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుజీత్ అంచనాలని మించేలా సాహో చిత్రాన్ని రూపొందించినట్లు ప్రభాస్ ప్రశంసించాడు. 

ఈ కేవలం ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 90 కోట్లకు ఖర్చు చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ చూస్తుంటే.. సాహో కి హిట్ టాక్ వస్తే చాలు నిర్మాతలకు కాసుల పంటే. 

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్  

చిరంజీవి గారు మెస్సేజ్ చేయగానే షాకయ్యా : ప్రభాస్ 

`సాహో` ట్రైలర్ రాజమౌళి ఎందుకంత సైలెన్స్?

100కోట్ల సినిమా చేయను.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన ప్రభాస్