ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ కొహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై భార్య శ్వేత గృహహింస కేసుని నమోదు చేసింది. అంతేకాదు.. శ్వేత కూతురు పాలక్ తివారీకి అతడు అసభ్య ఫోటోలను చూపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం నాడు భర్తకు వ్యతిరేకంగా ముంబై సమతా నగర్ పోలీస్ స్టేషన్ లో శ్వేతా ఫిర్యాదు చేసింది.

మద్యం మత్తులో తన భర్త రోజూ కొట్టేవాడని, తన కూతురు పాలక్ పై కూడా చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు అనుభవ్ ని స్టేషన్ కి పిలిచి.. నాలుగు గంటల పాటు చర్చించి ఆ తరువాత అతడిని అరెస్ట్ చేశారు.

శ్వేతా తివారీకి గతంలో రాజా చౌదరి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి పాలక్ అనే కూతురుంది. రాజా తనను వేధిస్తున్నాడని 2007లో అతడి నుండి విడాకులు తీసుకుంది శ్వేతా. ఆ తరువాత కొంతకాలం డేటింగ్ చేసిన అనుభవ్ కొహ్లీని 2013లో రెండో పెళ్లి చేసుకొంది.

వీరికి రేయాన్ష్ కొహ్లి అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శ్వేతా, అనుభవ్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి రెండేళ్ల క్రితం కథనాలు వెలువడ్డాయి. కెరీర్ విషయానికొస్తే.. శ్వేతా పలు సీరియళ్లలో నటించడం పాటు హిందీ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచింది.