భర్త కళ్లెదుట భార్యపై అత్యాచారం

Published : Aug 12, 2019, 04:36 PM IST
భర్త కళ్లెదుట భార్యపై అత్యాచారం

సారాంశం

ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని వారు  దాహంగా ఉందని.. మంచినీరు కావాలని కోరారు. అతను లోపలికి వెళ్లి తెచ్చేలోపు... ఆ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి దూరిపోయారు. అతనిని కట్టేసి... అతని భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్త దివ్యాంగుడు కావడంతో...భార్యను కాపాడుకోలేకపోయాడు.

భర్త కళ్లెదుటే ఓ భార్య అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం అస్సాంలోని బోక్ పారలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  బోక్ పారకు చెందిన వివేక్ కున్వర్, త్రిశాంత్ శర్మ, భాస్కర్ బోర్గహాయ్ లు శనివారం మధ్యాహ్నం ఓ ఇంటికి వెళ్లి తలుపుకొట్టారు. 

ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని వారు  దాహంగా ఉందని.. మంచినీరు కావాలని కోరారు. అతను లోపలికి వెళ్లి తెచ్చేలోపు... ఆ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి దూరిపోయారు. అతనిని కట్టేసి... అతని భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్త దివ్యాంగుడు కావడంతో...భార్యను కాపాడుకోలేకపోయాడు.

బాధితురాలు వారినుంచి తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్లకాలేదు. అత్యాచారం అనంతరం ఆ ముగ్గురు అక్కడినుంచి పరారయ్యారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు