బాలయ్యని ప్రభాస్ వాడుకోవడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోవలసిందే. ప్రభాస్ నటిస్తున్న సాహో ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు.. దర్శకుడు సుజీత్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మెదడుకు పనిపెట్టే సినిమాలా కూడా అనిపిస్తోంది. ప్రభాస్ కు సవాల్ విసిరే విలన్స్ చాలా మందే ఈ చిత్రంలో ఉన్నారు. 

ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా దర్శకుడు సుజీత్ ప్రభాస్ పాత్ర గురించి కొన్ని వివరాలు ప్రేక్షకులకు తెలియజేసేలా చేశాడు. పోలిసులకు సవాల్ గా మారిన రాబరీలని చేధించేందుకు అండర్ కవర్ కాప్ గా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో ప్రభాస్ ని పరిచయం చేస్తున్న సమయంలో అతడి పేరు అశోక చక్రవర్తి అని స్క్రీన్ పై కనిపించింది. 

నందమూరి బాలకృష్ణ 30 ఏళ్ల క్రితం నటించిన చిత్రం అశోక చక్రవర్తి. మారే స్టార్ హీరో తెలుగులో ఈ పేరుని ఉపయోగించలేదు. 1989లో విడుదలైన అశోక చక్రవర్తిలో బాలయ్య, భానుప్రియ జంటగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ కోసం దర్శకుడు సుజిత్ ఆ పేరుని ఉపయోగిస్తున్నాడు. 

కానీ ప్రభాసే అశోక చక్రవర్తి అనే నమ్మేయడానికి లేదు. ఎందుకంటే సాహో కథ గురించి అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ నకిలీ పోలీస్ ఆఫీసర్ మాత్రమే అని అంటున్నారు. ఆడియన్స్ ని థియేటర్స్ లో థ్రిల్ చేయడానికి దర్శకుడు ఇలా ట్రైలర్ ద్వారా చీటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రాణ స్నేహితులని కోల్పోయిన తర్వాత ప్రభాస్ ఇలా నకిలీ పోలీస్ ఆఫీసర్ గా మారతాడనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఆగష్టు 30 వరకు వేచి చూడాలి. 

ప్రభాస్ నోటి నుంచి సాహో అసలు బడ్జెట్ లెక్క.. అంతా షాక్!

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్  

చిరంజీవి గారు మెస్సేజ్ చేయగానే షాకయ్యా : ప్రభాస్ 

`సాహో` ట్రైలర్ రాజమౌళి ఎందుకంత సైలెన్స్?

100కోట్ల సినిమా చేయను.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన ప్రభాస్