టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న విజయం ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ ద్వారా అందింది. ఇక మొన్నటి వరకు ఆయన వైపు కూడా చూడని స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా మెస్సేజ్ లు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. అదే విధంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ సినిమా చేయనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఫైనల్ గా ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. లైన్ ప్రొడ్యూసర్ ఛార్మి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలిపింది. త్వరలోనే పూరి డైరెక్షన్ లో విజయ్ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు చెబుతూ.. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై సినిమాను పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 

త్వరలో సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని ఛార్మి వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు వీరు చేయబోతున్నది ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెలా? లేక మరో కొత్త కథను సెట్ చేసుకున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అలాగే మహేషే తో చేయాలనుకున్న జనగణమన సినిమా కూడా విజయ్ దేవరకొండతో చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ డౌట్స్ పై ఓ క్లారిటీ రావాలంటే స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.