బుల్లితెరపై బిగ్ బాస్ 3 గట్టిగానే హీటెక్కుతోంది. నాగార్జున హోస్ట్ లో ఈ రియాలిటీ షో మొదట్లో నార్మల్ గానే అనిపించినా రోజులు గడుస్తున్న కొద్దీ హౌజ్ వాతావరణం రోజుకో వివాదంతో మలుపులు తిరుగుతోంది. ఫైనల్ గా అందరూ ఉహించనట్టుగానే మూడవ ఎలిమినేషన్ లో తమన్నా సింహాద్రికి చేదు అనుభవం తప్పలేదు.  

ఇక నెక్స్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. నిన్న తమన్నా వెళ్లిపోవడంతో హౌజ్ లో 13 మంది కంటెస్టెంట్స్ లు ఉన్నారు. హేమ ఎలిమినేట్ కాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నా కొన్నిరోజులకే ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఆమె అతి ప్రవర్తన వల్లే హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని కంటెస్టెంట్ కామెంట్ చేశారు. 

అయితే వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమారి 21 ఫెమ్ హెబ్బా పటేల్ రానున్నట్లు టాక్ వస్తోంది. అలాగే శ్రద్దా దాస్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని సోమవారం నుంచి మాత్రం0 ఒక స్టార్ హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్లు సమాచారం.

బిగ్ బాస్3: వెన్నెల కిషోర్ ఇచ్చిన ట్విస్ట్.. తమన్నా ఎలిమినేటెడ్

బిగ్ బాస్ 3: తమన్నా, అలీ రెజాలకు నాగ్ వార్నింగ్!

బిగ్ బాస్ 3: సహనం కోల్పోయిన నాగార్జున.. అతడికి మూడింది!

బిగ్ బాస్ 3పై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు!