చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ హిట్ సౌండ్ వినబడుతోంది. సంపూర్ణేష్ బాబు కల్మషం లేని కామెడీ సినిమా కొబ్బరిమట్ట హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. పోటీగా కింగ్ మన్మథుడు 2 ఉన్నప్పటికీ కొబ్బరిమట్ట మాస్ ఆడియెన్స్ సపోర్ట్ తో మంచి లాభాలను అందుకుంటోంది. 

మరోవైపు శుక్రవారం రిలీజైన నాగ్ మన్మథుడు 2 మొదటిరోజు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నప్పటికీ శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. సినిమాలో అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కువవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా వరకు సినిమాను దూరం పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక మాస్ ఆడియెన్స్ కి చాలా వరకు కొన్ని సీన్లు బోర్ కొట్టించే విధంగా ఉన్నట్లు టాక్ రావడంతో కొబ్బరిమట్టకు బాగా కలిసొచ్చింది. 

పైగా విజయయాత్రతో చిత్ర యూనిట్ ప్రతి జిల్లాను కవర్ చేస్తుండడంతో అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా వైపు చూస్తున్నారు. మొత్తానికి సినిమాకు పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా సెలవుదినం కావడం అలాగే రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుండడంతో సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది, మొత్తంగా సంపూర్ణేష్ బాబు ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తాడో చూడాలి.