దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ మంచి పార్టనర్ కోసం ఎదుచూస్తోందట. అయితే అది తన లైఫ్ షేర్ చేసుకునే లైఫ్ పార్టనర్ కాదట. మంచి సినిమాలను రూపొందించే నిర్మాణ భాగస్వామి. పార్టనర్ దొరికితే సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టాలనేది కాజల్. ఏకే వెంచర్స్ పేరుతో ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థను రిజిస్టర్ చేయించింది కాజల్. కాకపోతే ఆ బ్యానర్ పై 
సోలో ప్రొడ్యూసర్ గా కాకుండా.. మరో పార్టనర్ ని కూడా కలుపుకొని సినిమాలు నిర్మించాలనేది ఆమె ఆలోచన.

ఇలా చేయడం వలన రిస్క్, ప్రెషర్ రెండూ తగ్గుతాయనేది ఆమె ఆలోచన. గతంలో తమన్నాతో కలిసి ఆమె నిర్మాణ రంగంలోకి దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ స్వయంగా వెల్లడించింది.

మరో మంచి పార్టనర్ కోసం చూస్తున్నట్లు కాజల్ చెప్పింది. కాజల్ నిర్మాతగా మారాలకుంటే ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. తేజ చెప్పిన ఓ కథతో పాటు ప్రశాంత్ వర్మతో మరో సినిమాపై చర్చలు సాగిస్తోంది కాజల్. వీటిలో ఏదోక సినిమా కాజల్ ఎంపిక చేసుకోవచ్చు.

కానీ ప్రస్తుతానికి నిర్మాతగా మారే ఆలోచన లేదని.. నటనపైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దానికి కారణంగా మంచి నిర్మాణ భాగస్వామి దొరకకపోవడమే.. అయితే ఫ్యూచర్ లో మాత్రం కచ్చితంగా సినిమాలు నిర్మిస్తానని అంటోంది. తనకు నచ్చే కథలను ఎన్నుకుంటూ సొంతంగా సినిమాలు నిర్మించుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'రణరంగం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.